కారులో వెళ్తున్నప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తోందా?.. ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రాబ్లం క్లియర్ !

by Dishafeatures2 |
కారులో వెళ్తున్నప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తోందా?.. ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రాబ్లం క్లియర్ !
X

దిశ, ఫీచర్స్ : జర్నీ అంటే చాలామందికి ఇష్టం. ఏమాత్రం అవకాశం దొరికినా తమ సొంత వాహనాల్లో విహార యాత్రలకో, బంధువులు ఇంటికో బయలు దేరుతుంటారు కొందరు. అయితే అలా కార్లల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక రకమైన బ్యాడ్ స్మెల్ రావడం పలువురిని ఇబ్బందికి గురిచేస్తుంది. కొందరికి దీనివల్ల వాంతులు, తలనొప్పి వంటివి వస్తుంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? రాకుండా కార్లల్లో సేఫ్ జర్నీ కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

* కారులో వెళ్తున్నప్పుడు బ్యాడ్ స్మెల్ రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. సరిగ్గా క్లీన్ చేయకపోవడం, తిన్న ఆహార పదార్థాలు కారులోనే వదిలేయడం, రెగ్యులర్‌గా వాష్ చేయకపోవడం వంటివి ఇందుకు దోహదం చేస్తాయి. అలాగే పెట్రోల్ లేదా డీజిల్ వాసన కూడా కొందరికి పడకపోవచ్చు. అలాంటప్పుడు బొగ్గు చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి కట్టెల పొయ్యిపై వంట చేయడం ద్వారా కానీ, భూమిలో కానీ లభించే కొన్ని బొగ్గు ముక్కలను ఒక పౌచ్‌లో పెట్టి కారులో ఉంచితే అది చెడువాసనను గ్రహిస్తుంది. కారును శుభ్రంగా ఉంచుతుంది.

* వివిధ పానీయాలు, ఆహార పదార్థాలు కారులో చల్లిపోవడం కారణంగా దుర్వాసన వస్తుంది. కానీ చాలామంది వీటిని గమనించరు. బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే పదార్థాలు కారులో ఒలికిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ పడిపోయినా వెంటనే తడిగుడ్డతో క్లీన్ చేయాలి.

* కారులో దుర్వాసనను పోగొట్టే మరో విషయం ఏంటంటే.. అందులోకి తగినంత వెలుతురు, గాలి వచ్చేలా చూసుకోవాలి. లోపలి గాలి బయటకు పోవడానికి ఆగి ఉన్నప్పుడు కారు డోర్లను, జర్నీలో ఉన్నప్పుపడు విండో గ్లాసెస్‌ను ఓపెన్ చేయడం ద్వారా దుర్వాసన పోతుంది. దీంతోపాటు బేకింగ్ సోడా కూడా దుర్వాసనను పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి జర్నీకి ముందు కారు సీట్లపై దానిని చల్లి శుభ్రం చేస్తే సరి.

Next Story

Most Viewed