పోలీస్ స్టేషన్‌లో డ్యాన్స్ ఘటన ఎఫెక్ట్ .. SI సహా 8 మందిపై వేటు

by Disha Web Desk 4 |
పోలీస్ స్టేషన్‌లో డ్యాన్స్ ఘటన ఎఫెక్ట్ .. SI సహా 8 మందిపై వేటు
X

దిశ, కాటారం : మహాదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో ఓ రాజకీయ నేత స్టెప్పులు వేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం పెను సంచలనంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జడ్పీటీసీ భర్త గుడాల శ్రీనివాస్ పోలీస్ స్టేషన్‌లో ఓ సినిమా పాటకు నృత్యాలు చేయడం సిబ్బంది ప్రోత్సహించిన ఘటనను పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ కిరణ్ కరే పూర్తిస్థాయిలో విచారణ జరిపించారు. ఎస్ఐతో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, ఆరుగురు పోలీస్ కానిస్టేబుల్స్‌పై వేటు పడింది.

విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఎస్పీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీరందరిపై వేటు వేశారు. మహాదేవపూర్ ఎస్సై ప్రసాద్‌ను వీఆర్ జిల్లా కేంద్రానికి బదిలీ చేశారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులును సస్పెండ్ చేశారు. మహాదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్‌ను ఘన్పూర్ పోలీస్ స్టేషన్‌కు, ఆరుగురు కానిస్టేబుల్స్ ధనుంజయని మొగుళ్లపల్లికి, అరుణ్ కుమార్‌ను రేగొండకు, ఎస్ విక్రాంత్ కాటారంనకు, జి కిరణ్ చిట్యాలకు, జే తిరుపతి కొయ్యూరుకు, పి నాగరాజు మహాదేవపూర్ సర్కిల్ ఎస్బిఐ కానిస్టేబుల్ గా బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలు జారీ చేశారు. జయశంకర్ భూపాల పల్లి పోలీస్ శాఖ పరిధిలోని ఇంత పెద్ద ఎత్తున క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది.


Next Story