కోమటిరెడ్డి అక్కడ ప్రచారం చేయాలి: దామోదర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
కోమటిరెడ్డి అక్కడ ప్రచారం చేయాలి: దామోదర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: చండూర్ బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు టీ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అద్దంకి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేయగా.. అద్దంకితో పాటు టీపీసీసీ రేవంత్ రెడ్డి కూడా ఆయనకు బహిరంగా క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అద్దంకి దయాకర్‌ను కాంగ్రెస్ నుండి సస్సెండ్ చేయాల్సిందేనని.. అప్పటి వరకు మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనేది లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు.

ఈ వివాదంపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి స్పందించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొనాలని దామోదర్ రెడ్డి సూచించారు. మునుగోడు ఉపఎన్నిక కోమటిరెడ్డికి పిలవని పేరంటం కాదని.. ఆయన పార్టీ స్టార్ క్యాంపెయినర్ హోదాలో మునుగోడులో ప్రచారం చేయాలని అన్నారు. అంతేకాకుండా స్టార్ క్యాంపెయినర్‌గా ఆయన పార్టీలో అందర్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు లేవని.. పార్టీలో అందరూ సమానమేనన్నారు. ఇక, పార్టీ నుండి నేతల బహిష్కరణ విషయాన్ని క్రమశిక్షణ కమిటి చూసుకుంటుందని తెలిపారు.

Komatireddy Venkat Reddy: ''నేను చూడలేదు.. వినలేదు''.. రేవంత్ క్షమాపణపై కోమటిరెడ్డి రియాక్షన్


Next Story

Most Viewed