‘సీపీగెట్’ నోటిఫికేషన్ రిలీజ్.. అప్లికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే!

by Disha Web Desk 19 |
‘సీపీగెట్’ నోటిఫికేషన్ రిలీజ్.. అప్లికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల్లో (పీజీ) పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీ గెట్) నోటిఫికేషన్‌‌ను సోమవారం ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ఆర్ లింబాద్రి విడుద‌ల చేశారు. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్, మహిళా యూనివర్సిటీల్లో సీపీగెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ నెల 12 నుంచి సీపీగెట్ -2023 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.

జూన్ 11 వరకు దరఖాస్తులకు గడువు విధించినట్లు కన్వీనర్ పాండురంగా రెడ్డి తెలిపారు. రూ. 500 ఆలస్య రుసుముతో జూన్ 18 వరకు, రెండు వేల లేట్ ఫీజ్‌తో జూన్ 20వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. సీపీగెట్‌ పరీక్ష జూన్‌ చివరి వారంలో జరుగనున్నట్లు వివరించారు. ఎగ్జామ్ ఆన్‌లైన్‌లోనే ఉంటుందని స్పష్టంచేశారు. పూర్తి వివరాల కోసం www.osmania.ac.in, cpget.tsche.ac.in, www.ouadmissions.com వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సీపీగెట్‌ కన్వీనర్‌ పాండురంగారెడ్డి కోరారు.

ఇవి కూడా చదవండి:

అలర్ట్: ఎడ్ సెట్ అప్లికేషన్ల గడువు పొడిగింపు.. దరఖాస్తుకు చివరి తేదీ అదే!


Next Story