అంబేద్కర్ విగ్రహం నిర్మాణం తెలంగాణకే గర్వకారణం: మంత్రి కొప్పుల

by Disha Web Desk 19 |
అంబేద్కర్ విగ్రహం నిర్మాణం తెలంగాణకే గర్వకారణం: మంత్రి కొప్పుల
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ కాంస్య విగ్రహం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మే 13న దళిత, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కృతజ్ఞత అభినందన సభ నిర్వహించనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని మంత్రుల క్వార్టర్స్ లో శుక్రవారం దళిత గిరిజన సంఘాల ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకోసం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. దళితోద్ధరణకు సీఎం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చి అట్టడుగు వర్గాలకు అందజేస్తున్నారని చెప్పారు.

దళితుల పట్ల సమాజ దృక్పథం మారేలా, గుణాత్మక మార్పునకు కేసీఆర్ కృషిచేస్తున్నారని వెల్లడించారు. అంబేద్కర్ కాంస్యం విగ్రహం, సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 38వేల కోట్లు దళితులకే కేటాయించారని, అంబేద్కర్ విగ్రహం నిర్మాణం తెలంగాణకే గర్వకారణం అన్నారు. ప్రతిపక్షాలు చేయరు.. ఇతరులను చేయనివ్వరని మండిపడ్డారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రభుత్వానికి అందరూ బాసటగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్, దళిత గిరిజన సంఘాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Next Story