కాంగ్రెస్ పార్టీనే మాకు వెన్నుపోటు పొడిచింది.. బీఆర్ఎస్ నేత

by Disha Web Desk 5 |
కాంగ్రెస్ పార్టీనే మాకు వెన్నుపోటు పొడిచింది.. బీఆర్ఎస్ నేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: సబిత ఇంద్రారెడ్డి కుటుంబం పార్టీ మారుతున్నారన్న వార్తలపై స్పందించిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. రంగారెడ్డి జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనిదని, ఇంద్రారెడ్డి కుటుంబాన్ని 1983 నుంచి 10 సార్లు గెలిపించి, తమని ఆశీర్వదిస్తున్నందుకు ధన్యావాదాలు తెలిపారు. తమ కుటుంబం గతంలో పార్టీలు మారారని, ఇప్పుడు కూడా మారుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని, వీళ్ల మార్పుకి, మా మార్పుకి తేడా ఉందని చెప్పుకొచ్చారు. ఇంద్రారెడ్డికి స్వర్గీయ ఎన్‌టీ రామారావు గారు రాజకీయ బిక్ష పెట్టారని, ఆయన మరణించిన తర్వాతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ లోకి వెళ్లామన్నారు.

తర్వాత వైఎస్ఆర్ బ్రతికున్నంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ తోనే ఉన్నామని రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరేసి తిరగామని తెలియజేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబంపై ఐదు సీబీఐ కేసులు పెట్టిందని, రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు రెండు టికెట్లు ఇచ్చినా, మాకు ఒక్క టికెట్ ఇచ్చి మోసం చేసిందని, చివరికి మేము నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని లేకుండా చేయాలని చూసిందని వాపోయారు. ఆ సమయంలో కేసీఆర్, కేటీఆర్ పిలిచి అవకాశం ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీకి మేము వెన్నుపోటు పొడవలేదని, కాంగ్రెస్ పార్టీనే మాకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపణలు చేస్తూ.. వారికి మాకు పోలిక పెట్టొద్దని కోరారు తమ కుటుంబం ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ లతో ఎలా ఉందో.. అలాగే చివరి వరకు కేసీఆర్ గారితో ఉంటామని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed