కాంగ్రెస్ కనీస గౌరవం ఇవ్వడం లేదు.. కనీస పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు: TJS

by Disha Web Desk 12 |
కాంగ్రెస్ కనీస గౌరవం ఇవ్వడం లేదు.. కనీస పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు: TJS
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కనీస ధర్మాన్ని పాటించడం లేదని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధర్మార్జున్ ,బైరి రమేష్ లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ లో వారు మీడియాతో మాట్లాడుతూ అప్రజాస్వామిక కుటుంబ పాలన సాగిస్తున్న కెసిఆర్, భారత రాష్ట్ర సమితి పార్టీని ఓడించుటకు కాంగ్రెస్ పార్టీ తో ఎన్నికల పొత్తుకు తెలంగాణ జనసమితి రాజకీయాలను రిజర్వ్ లో పెట్టుకొని సంప్రదింపులు, చర్చలకు పూనుకుందన్నారు .

కానీ కాంగ్రెస్ పార్టీ మాతో చర్చలు తాత్సారం చేస్తూ అన్ని నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించుకున్నారు. కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామని అన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసహనానికి గురవుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు తలా ఒక తీరుగా మాట్లాడుతున్న తీరు సరైంది కాదన్నారు . ఈ పరిణామాలను మా పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రత్యామ్నాయాల పై చర్చ చేస్తున్నామని తెలిపారు .



Next Story

Most Viewed