కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అంత సీన్​ లేదు.. ఎమ్మెల్యే సీతక్క

by Dishafeatures2 |
కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అంత సీన్​ లేదు.. ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్​ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. బీఆర్ఎస్​ కావాలనే అరెస్ట్ డ్రామాను చూపి బీజేపీని హైప్​ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గురువారం గాంధీభవన్​ లో ఆమె మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్​ఎస్ లు ముందస్తు ఒప్పందాల ప్రకారం ఆయా పార్టీల యాక్టివిటీస్ ను కొనసాగిస్తున్నారన్నారు. పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నారన్నారు. కాంగ్రెస్​ పార్టీని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలకు పాల్పడినా.. కాంగ్రెస్​ దే విజయం అన్నారు.

అసలు రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్​స్ ఎప్పటి నుంచో ఉన్నదని, గతంలో కాంగ్రెస్ ​ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. అసెంబ్లీ వేదికగా అనేక సార్లు ప్రశ్నించామన్నారు. ఇళ్ల పరిశీలన కూడా జరిగిందన్నారు. ఇప్పుడు కిషన్​ రెడ్డి తన సైలెన్స్ ను డైవర్ట్ చేసుకోవడానికి డ్రామాలు మొదలు పెట్టాడన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కిషన్ రెడ్డి ఇక్కడ ఉండి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.

మణిపూర్​ఘటన దారుణం

మణిపూర్ లో దారుణం జరుగుతోందన్నారు. ప్రధానికి ఏం తెలియనట్టుగా వ్యవహరిస్తున్నాడన్నారు. మణిపూర్ సంఘటన సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నదన్నారు. కుకీ తెగపై దాడులు, హత్యాచారాలు బాధాకరమన్నారు. మహిళలు బయటకు రాకుండా చేసే ప్రక్రియకు బీజేపీ తెర లేపిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పిల్లలు అని చూడకుండా హత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. మణిపూర్ సీఎం కూడా ఇవేం కొత్తవి కాదని చెప్పడం బాధాకరమన్నారు. కొట్లాటలు జరుగుతుంటే అక్కడి సీఎం, పీఎం డిస్కస్ చెయ్యలేదా ? అని సీతక్క ప్రశ్నించారు.

మోడీ సర్కార్​ దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ఈశాన్య రాష్ట్రాల కు ఇంచార్జిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడికి వెళ్లి, పరిశీలించకుండా.. ఇక్కడ టైం పాస్​చేస్తున్నాడని ఫైర్​ అయ్యారు. గుజరాత్ లో మోడీ సీఎంగా ఉన్నప్పుడే గోద్రా ఘటనలో వేలాది మహిళలు చనిపోయారన్నారు. బీజేపీ సర్కార్ రాజకీయం కోసమే తప్పా.. మానవత్వం కోసం పనిచేయడం లేదన్నారు.




Next Story

Most Viewed