30 లక్షల ఉద్యోగాల వివరాలు కవిత చెప్పాలి.. కాంగ్రెస్ డిమాండ్

by Disha Web Desk 14 |
30 లక్షల ఉద్యోగాల వివరాలు కవిత చెప్పాలి.. కాంగ్రెస్ డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు అసక్తిగా మారాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్‌లో కాంగ్రెస్ అధికార ప్రతినిధులు భవాని రెడ్డి, జ్ఞాన సుందర్, ఏఐసీసీ మీడియా ఇంచార్జ్ సునీతా పాల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవాని రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని కవిత అబద్ధాలు చెబుతోందన్నారు. 30 లక్షల ఉద్యోగాల వివరాలు కవిత చెప్పాలని డిమాండ్ చేశారు. గత పది ఏళ్లలో కుల గణనపై కనీసం నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు వచ్చిన ప్రతిసారీ ఢిల్లీ వెళ్లి టెంట్ వేస్తదని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ పదేళ్లలో మహిళలకు ఏం చేయలేదన్నారు. తాము మహిళాభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటే తట్టుకోలేకపోతున్నారని, గోప్రో కెమెరాలు పెట్టుకొని, వాళ్ళ కార్మిక సంఘ ఆటోల్లో కేటీఆర్ తిరుగుతూ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.

ఏఐసీసీ మీడియా ఇంచార్జీ సునీతా పాల్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పీపుల్స్ సీఎం అని, ప్రజల కోసం ఆలోచిస్తున్నారని చెప్పారు. కేటీఆర్ మాత్రం ప్రజలని వాడుకుంటూ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మొన్నటి దాకా ప్రజలని దోచుకున్నారని మండిపడ్డారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. సర్కార్ ఏర్పడి ఇంకా 50 రోజులు కూడా కాలేదని, అప్పుడే విమర్శలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. కేటీఆర్ ప్రజల్లో తిరిగితే పది సంవత్సరాల్లో ఏం చేశారని ఆయన్ని ప్రజలు అడుగుతున్నారన్నారు. బీజేపీ కోసం బీఆర్ఎస్ పని చేస్తోందని ఆరోపించారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నేతలు మతిస్థిమితం కోల్పోయారని విమర్శించారు.



Next Story

Most Viewed