జగ్గారెడ్డి మీసం తిప్పిన CM రేవంత్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న వీడియో

by Disha Web Desk 19 |
జగ్గారెడ్డి మీసం తిప్పిన CM రేవంత్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. నామినేషన్ దాఖలు సందర్భంగా మెదక్‌లోని రాందాస్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అయితే, ఈ సమావేశంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం ముదిరాజ్ గెలుపును కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతుండగా పక్కనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి మీసం తిప్పారు. ఈ సీన్ చూసిన కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్‌తో నినాదాలు హోరెత్తించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జగ్గారెడ్డి మీసం తిప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed