నేడు ఢిల్లీకిCM రేవంత్.. 13 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులపై సస్పెన్స్ వీడనుందా..!

by Rajesh |
నేడు ఢిల్లీకిCM రేవంత్.. 13 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులపై సస్పెన్స్ వీడనుందా..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఎన్నికల కమిటీ మీటింగ్ లో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. సెకండ్ లిస్ట్‌పై హై కమాండ్‌తో రేవంత్ చర్చించనున్నారు. ఇక తెలంగాణలో 4 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మిగిలిన 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై నేడు ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం 17 ఎంపీ స్థానాలకు 309 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఇక, 13 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ హై కమాండ్ అభిప్రాయ సేకరణ చేపట్టింది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ అంటూ మంగళవారం తెలంగాణ పర్యటన సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించిన నేపథ్యంలో సెకండ్ లిస్ట్ ఈ భేటీ తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ భేటీ అనంతరం ప్రకటన రానున్న నేపథ్యంలో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Next Story

Most Viewed