BV పట్టాభిరామ్ మృతి పట్ల CM రేవంత్ దిగ్భ్రాంతి

by Gantepaka Srikanth |

ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక వైద్యుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్(BV Pattabhiram) మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర సంతాపం ప్రకటించారు.

BV పట్టాభిరామ్ మృతి పట్ల CM రేవంత్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక వైద్యుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్(BV Pattabhiram) మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇంద్రజాల విద్య ద్వారా మూఢ నమ్మకాల నుంచి ప్రజలను జాగృతం చేయడంలో పట్టాభిరామ్ ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. తన ఇంద్రజాల విద్య ద్వారా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేసిన పట్టాభిరామ్ లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. పట్టాభిరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 1984లో హైదరాబాద్‌లో కళ్లకు గంతలు కట్టుకుని రవీంద్రభారతి నుంచి చార్మినార్‌ వరకు స్కూటర్‌ నడిపి ఇంద్రజాల విద్యలో తెలుగునేలపై కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. చేతబడి వంటి మూఢనమ్మకాలపై ప్రజలను జాగృతం చేసే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి బండి సంజయ్, మంత్రి నారా లోకేష్ సైతం సంతాపం ప్రకటించారు.

Next Story