CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

by Disha Web Desk 1 |
CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహా నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రద్దీగా ఉన్న పలు మార్గాల్లో అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. మహానగరంలో దాదాపు 12 వేల కి.మీ మేర రోడ్లు విస్తరించి ఉన్నాయి. అయితే, రహదారులు మరీ ఇరుకుగా ఉండటంతో ఎక్కడ చూసినా.. నిత్యం ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. 30 నిమిషాల ప్రయాణానికి సైతం గమ్య స్థనాన్ని చేరుకోవడానికి గంటకు పైగా సమయం పడుతోంది.

అయితే, రోడ్ల విస్తరణకు భారీ భవనాలు అడ్డుగా ఉండటంతో ఇక అండర్ గ్రౌండ్ టన్నెళ్ల నిర్మాణమే సరైన నిర్ణయమని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చారు. ఈ మేరకు ఐటీసీ కోహినూర్ నుంచి ఖాజాగూడ, నానక్‌రామ్‌ గూడ మీదుగా విప్రో సర్కిల్ వరకూ 9.5 కి.మీ మేర భారీ టన్నెల్‌ను నిర్మించబోతున్నారు. ఇక ఐటీసీ కోహినూర్ నుంచి మైండ్‌స్పేస్ జంక్షన్ మీదుగా జేఎన్‌టీయూ వరకూ 8 కి.మీ మేర టన్నెల్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఐటీసీ కోహినూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 మీదుగా రోడ్ నెం.10 వరకు దాదాపు 6.5 కిమీ మేర మరో టన్నెల్‌ రూపకల్పనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక జీవీకే మాల్ నుంచి మాసబ్ ట్యాంక్ మీదుగా నానల్‌నగర్ వరకు 6 కి.మీ టన్నెల్ మార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నాంపల్లి నుంచి చార్మినార్ మీదుగా చాంద్రాయణ గుట్ట ఇన్నర్ రింగ్‌ రోడ్డు వరకూ 9 కి.మీ టెన్నెల్ నిర్మించనున్నారు. దీంతో భవిష్యత్తులో నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి.



Next Story

Most Viewed