CM KCR: ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.. మంచిర్యాల పర్యటనలో సీఎం కేసీఆర్

by Dishafeatures2 |
CM KCR: ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.. మంచిర్యాల పర్యటనలో సీఎం కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కుల, మతాలకు అతీతంగా తెలంగాణలో సంక్షేమం అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ చాలా అంశాల్లో దేశంలోనే నంబర్ వన్ గా ఉందని, ఇప్పటి వరకు ఎన్నో చేశామని చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన సీఎం.. కలెక్టరేట్ భవనంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కుల వృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం స్కీమ్, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ అని కరోనా, నోట్ల రద్దుతో ఆటంకాలు ఎదురైనా వాటన్నింటిని దాటుకుని పని ముందుగు సాగామని చెప్పారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. వరిసాగులో పంజాబ్ ను మించిపోయామన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరవేస్తున్న అధికారులకు ధన్యవాదాలు చెప్పారు. దేశంలో 10 అవార్డులు ఇస్తే 9 తెలంగాణకు వస్తోందని ఇందంతా అధికారుల కృషి తో సాధ్యం అయిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రాబోతున్నాయన్నారు. పామాయిల్ దిగుమతులు తగ్గిపోవాలని ఇక్కడే సాగు చేసుకోవాలన్నారు.

Also Read..

'ఆ మాట అనడానికి సిగ్గనిపించడం లేదా?'.. కేటీఆర్ వ్యాఖ్యలపై షర్మిల ఫైర్



Next Story

Most Viewed