- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
దానికి మీ సమాధానం ఏంటి మోడీగారు: సీఎం కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ సర్కార్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్ని్కల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ పారద్రోలాలి అని పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలని అనేక రైతు సంఘాలు తనను కోరాయని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేదంతా గోల్‌మాల్ ముచ్చట్లేనని విమర్శించారు. వ్యవసాయ బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెట్టాలన్న బీజేపీ మోసపూరిత ఆలోచనకు బుద్ధి చెప్పాలని రైతులను కోరారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి మరే రాష్ట్రంలో జరుగడం లేదని తెలిపారు.
బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో మద్యపాన నిషేధం విధించినా.. కల్తీ మద్యం ఏరులై పారుతోందని ఎద్దేవా చేశారు. ఆ కల్తీ మద్యానికి ఎందరో అమాయకులు బలయ్యారని, దానికి మీ సమాధానం ఏంటి మోడీగారు అని ప్రశ్నించారు. గుజరాత్ మోడల్ అని చెప్పి దేశ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివితక్కువ కేంద్ర ప్రభుత్వం వల్ల గోధుమలు, బియ్యం, దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దొంగల బూట్లు మోసే సన్నాసులు ఇక్కడ తెలంగాణలో ఉన్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ గజదొంగలు, లంచగొండులు తెలంగాణకు వచ్చి నీతులు చెబుతున్నారని, అంతేగాక నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడి మత విద్వేశాలు రెచ్చ గొడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.