కరోనా ఎఫెక్ట్ : సుప్రీంకోర్టు న్యాయవాదులకు వర్క్ ఫ్రమ్ హోం!

by Dishanational2 |
కరోనా ఎఫెక్ట్ : సుప్రీంకోర్టు న్యాయవాదులకు వర్క్ ఫ్రమ్ హోం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో మరోసారి కరోనా మహమ్మారి బుసలు కొడుతోంది. కొవిడ్ కేసుల సంఖ్య పెరుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సుప్రీంకోర్టు న్యాయవాదులు వర్చువల్ గా హాజరుకావొచ్చని బుధవారం తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయని అందువల్ల న్యాయవాదుల కోసం మరోసారి హైబ్రిడ్ మోడ్ కూడా అందుబాటులోకి తీసుకు వస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల కారణంగా గతంలో వర్చువల్ గా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. కొవిడ్ కేసుల సంఖ్య తగ్గిపోవడంతో గతేడాది ఏప్రిల్ 4 నుంచి సుప్రీంకోర్టులో తిరిగి ఫిజికల్ హియరింగ్స్ మొదలయ్యాయి. తాజాగా మరోసారి కొవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించడంలో న్యాయవాదులు వర్క్ ఫ్రమ్ హోం ద్వారా కూడా వాదనలు వినిపించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సీజేఐ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా బుధవారం 4,435 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.


Next Story