కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ సంచలన ప్రకటన.. బీఆర్ఎస్ కు షాక్ తప్పదా?

by Disha Web Desk 13 |
కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ సంచలన ప్రకటన.. బీఆర్ఎస్ కు షాక్ తప్పదా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు అంశంలో తాజాగా హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో దర్యాప్తు సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం లేదా హైకోర్టు దర్యాప్తుకు ఆదేశిస్తే విచారణ చేస్తామని సీబీఐ పేర్కొంది. దర్యాప్తుకు అవసరమైన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని కోరింది. అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్ స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలతో పాటు సిబ్బంది కావాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై రాంమోహన్ రెడ్డి అనే అడ్వకేట్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరింగిది. ఈ సందర్భంగా సీబీఐ ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసింది. కాళేశ్వరం అక్రమాలపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశిస్తే దర్యాప్తు చేసేందుకు తాము రెడీగాఉన్నామంటూ సీబీఐ పేర్కొనగా ఈ విషయంలో ఫిబ్రవరి 2న మరోసారి విచారణ చేస్తామని హైకోర్టు పేర్కొంది. కాగా ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కాళేశ్వరం అక్రమాలపై రాజకీయ రగడ కొనసాగుతున్న వేళ సీబీఐ చేసిన ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.


Next Story