ఢిల్లీ లిక్కర్ స్కాం.. MLC Kavitha మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ అరెస్ట్

by Disha Web Desk 12 |
ఢిల్లీ లిక్కర్ స్కాం.. MLC Kavitha మాజీ  చార్టర్డ్ అకౌంటెంట్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు కీలక పాత్ర వహించాడని..హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను బుధవారం సీబీఐ అరెస్టు చేసింది. అయితే, బుచ్చిబాబు రామచంద్ర పిళ్లైకి సీఏగా కూడా వ్యవహరించాడు. నిన్న దర్యాప్తులో భాగంగా బుచ్చిబాబును ప్రశ్నించిన సీబీఐ అధికారులు..విచారణ తర్వాత అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఈ మేరకు బుధవారం బుచ్చిబాబు అరెస్టు చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. వైద్య పరీక్షల తర్వాత బుచ్చిబాబును కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, బుచ్చిబాబును తమ కస్టడీలోకి తీసుకోనేందుకు కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. గతంలో పలుమార్లు గోరంట్ల బుచ్చిబాబు ఇంట్లో, అసోసియేట్స్ కార్యాలయంలో సీబీఐ సోదాలు నిర్వహించింది.

ఈ సోదాల సమయంలో కీలకమైన డాక్యుమెంట్లను సేకరించారు. పలుమార్లు ఢిల్లీకి కూడా పిలిచి బుచ్చిబాబును సీబీఐ ప్రశ్నించింది. ఇక, లిక్కర్ స్కాం ఛార్జిషీట్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. పంజాబ్, గోవా ఎన్నికల ప్రచారం నిధుల కోసమే ఆప్ నేతలు లిక్కర్ స్కాంకి తెరలేపినట్లు ఈడీ పేర్కొంది. కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఆప్‌ మీడియా వ్యవహారాల ఇంచార్జి విజయ్ నాయర్.. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి : అందరి చూపు.. కార్పొరేటర్ల వైపే!



Next Story

Most Viewed