దేవరకద్రలో అండర్ పాస్ నిర్మాణం పూర్తి చేస్తాం : దేవరకద్ర ఎమ్మెల్యే

by Disha Web Desk 23 |
దేవరకద్రలో అండర్ పాస్ నిర్మాణం పూర్తి చేస్తాం : దేవరకద్ర ఎమ్మెల్యే
X

దిశ, దేవరకద్ర: దేవరకద్ర మండల కేంద్రంలోని అండర్ పాస్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్ర మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర పట్టణ ప్రజల బాధ ఇబ్బందులు చూసి దేవరకద్రలో అండర్ పాస్ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చాము, హామీ మేరకు అండర్ పాస్ నిర్మాణం కోసం గత నెలలో రైల్వే ఉన్నతాధికారులను కలిశామని తమ అభ్యర్థన మేరకు రైల్వే ఉన్నతాధికారులు గత రెండు రోజుల క్రితం వచ్చి అండర్ పాస్ నిర్మాణం కోసం సర్వే చేశారని త్వరలోనే అండర్ పాస్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని అన్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే కానీ గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఎవరికీ ఇవ్వలేదని త్వరలోనే ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథకానికి 400 రూపాయలు ఇస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల లోపే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని గత పది సంవత్సరాల మోడీ పాలనలో దేశానికి చేసిన మేలు ఏమి లేదని అన్నారు సిలిండర్ పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచారని మండిపడ్డారు రైతులకు రుణమాఫీ పంద్రాగస్టు లోగా పూర్తి చేస్తామని అన్నారు. మోడీ పాలనలో పేదవాడి ఆర్థిక పరిస్థితిని దిగజారడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ నిరుద్యోగులను మోసం చేశారని జనధన్ ద్వారా నల్లధనం తెచ్చి పేదల ఖాతాలో 15 లక్షలు వేస్తానని మోసం చేశారని అన్నారు.

మన పాలమూరు అభివృద్ధి చెందాలంటే చేతి గుర్తుకు ఓటు వేసి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం దేవరకద్ర మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఇతర పార్టీలకు ల నాయకులు జిఎంఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మీకాంత్ రెడ్డి,దేవరకద్ర కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంజల్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు ఆది హనుమంత్ రెడ్డి, కొండ శ్రీనివాస్ రెడ్డి, అంజన్ కుమార్ రెడ్డి, వర్మ ముదిరాజ్, నరసింహారెడ్డి , గోవర్ధన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story