ఆ కేంద్ర మంత్రిపై ప్రివిలేజ్ మోషన్.. ప్లాన్ చేస్తోన్న బీఆర్ఎస్ ఎంపీలు!

by Disha Web Desk 19 |
ఆ కేంద్ర మంత్రిపై ప్రివిలేజ్ మోషన్.. ప్లాన్ చేస్తోన్న బీఆర్ఎస్ ఎంపీలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు తన ప్రకటనలు సవరించుకొని వాస్తవాలతో కూడిన తాజా ప్రకటనను పార్లమెంట్‌లో ప్రకటించాలని, లేకుంటే పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఎంపీలు ప్లాన్ చేస్తున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటించారు. శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అసలు కోరనేలేదని పార్లమెంట్ సాక్షిగా మంత్రి అబద్ధాలు చెప్పారని, తన తప్పుడు ప్రకటనను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తున్నందున ఈ రెండు ప్రాజెక్టులలో ఏదో ఒక దానికి జాతీయ హోదా ఇవ్వాలని 2018 జూలై 20 కరీంనగర్ ఎంపీగా పార్లమెంట్‌లో మోడీ సహా కేంద్ర ప్రభుత్వానికి కోరినట్లు తెలిపారు.

ఎంపీగా మాట్లాడిన మాటలు పార్లమెంటు రికార్డ్స్‌లో ఉన్నాయని వాటిని తెప్పించుకోవాలని సూచించారు. యూపీ ఎన్నికల సమయంలో కెన్ బెట్వా ప్రాజెక్టుకు రూ.45, 000కోట్లు, కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.15, 000 కోట్లు కేటాయిస్తూ జాతీయ హోదా ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఇది కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రం కేంద్రం మొండి చేయి చూపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను వక్రీకరించి పార్లమెంట్‌ను, దేశ, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.


Next Story

Most Viewed