బీఆర్ఎస్ ఫేక్ సర్కార్.. కాంగ్రెస్ హయాంలోనే ఐటీ అభివృద్ధి : మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

by Disha Web Desk 13 |
బీఆర్ఎస్ ఫేక్ సర్కార్.. కాంగ్రెస్ హయాంలోనే ఐటీ అభివృద్ధి : మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్​ఎస్​ ఫేక్ ​సర్కార్​ అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గాంధీభవన్‌లో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నదన్నారు.ఐటీ గురించి తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కాంగ్రెస్​ హయాంలోనే ఐటీ అభివృద్ధి చెందిందన్నారు. టీఆర్​ఎస్ ​ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 65 కంపెనీలు వెళ్లిపోయాయని చెప్పారు. మరోవైపు తైవాన్ సంస్థ హైదరాబాద్ కు వస్తుంది అంటూ తెలంగాణ సర్కార్ అపోహలు సృష్టించిందన్నారు.

ఐటీ రంగం జనార్ధన్​రెడ్డి ముఖ్యమంత్రి ఉండగానే రాష్ట్రంలో షురూ అయిందన్నారు.ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కొంత, కాంగ్రెస్​ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య దోరణితోనే ఐటీ రంగం కుదేలవుతున్నట్లు పొన్నాల పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ప్రభుత్వ హయంలో కొత్త కంపెనీలు తెచ్చినట్లు శ్వేతా పత్రం విడుదల చేసే దమ్ము ఉందా.. ? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఐటీ అంటే ఇండియన్ టాలెంట్ అని ఉండేదని, కానీ ఇప్పుడు ఇవంకా ట్రంప్ గా మారిందన్నారు.

70 లక్షల ఉద్యోగాలు వచ్చే ఐటీఐఆర్​ముచ్చట ను ప్రభుత్వం మరచి పోయిందన్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలోనూ బీఆర్​ఎస్​ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి మాట్లాడుతూ..జలయజ్ఞం ప్రాజెక్టులు ,ఐటీ అభివృద్ధి లో కాంగ్రెస్ పాత్ర లేనట్లు బీఆర్ఎస్ నేతలు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ఉచిత విద్యుత్ ను ఇచ్చింది కాంగ్రెస్​పార్టీ అన్నారు.టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతూ..మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హర్షవర్ధన్ రెడ్డి గెలిపించేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై దశాబ్దాలుగా హర్షవర్ధన్ రెడ్డి పోరాటం చేస్తున్నారని, అందుకే గెలిపించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

Next Story

Most Viewed