BREAKING: తెలంగాణ తల్లి, ప్రభుత్వ అధికారిక చిహ్నంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
BREAKING: తెలంగాణ తల్లి, ప్రభుత్వ అధికారిక చిహ్నంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాచరికపు ఆనవాళ్లు ఉండకూడదనేదే తమ ప్రభుత్వ విధానమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి, ప్రభుత్వం అధికారిక చిహ్నాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారిక చిహ్నంలో రాచరిక పోకడలు ఉన్నాయని అందుకే ఆ చిహ్నాన్ని త్వరలో మార్చబోతున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం సగటు తెలంగాణ బిడ్డలా లేదని, నగలు, కీరీటాలతో అంలంకరించి ఉండటం సరికాదని అన్నారు. చాకలి ఐలమ్మ పోరాటం చేసిన నేల తెలంగాణ అని, అలాంటి వీర మహిళల అస్థిత్వాన్ని కాపాడేందుకే తెలంగాణ తల్లి నూతన విగ్రాహాన్ని రూపొందిస్తామని స్పష్టం చేశారు. అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుతామని తెలిపారు.

Also Read..

KCR అసెంబ్లీకి రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

Next Story

Most Viewed