BREAKING: నిజామాబాద్‌లో కారు పార్టీకి మరో దెబ్బ.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

by Disha Web Desk 1 |
BREAKING: నిజామాబాద్‌లో కారు పార్టీకి మరో దెబ్బ.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టింది. ఎలాగైన మెజారిటీ ఎంపీ స్థానాలను చేజిక్కించుకునేందుకు పథకాలను రచిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని మరింత పెంచుకునేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా సంప్రదించారు. మరో రెండు రోజుల్లో బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

కాగా, బాజిరెడ్డి గోవర్ధన్ స్వతంత్రంగా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించాడు. 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అనంతరం 1994లో ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణ దేవి చేతిలో 14,043 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తరువాత అయన పీఏసీఎస్ సపఏసిఎస్ చైర్మన్‌గా, హౌసింగ్ బోర్డు కమిటీ చైర్మన్‌గా పనిచేశాడు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి, 1999–2004 వరకు ఆర్మూర్ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా, 2004–2009 వరకు బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు.

అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డి.శ్రీనివాస్‌పై 26 వేల ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేకుల భూపతిరెడ్డి‌పై 29,855 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. 2015–2018 వరకు తెలంగాణ శాసనసభ వక్ఫ్ భూములపై హౌస్ కమిటీ చైర్మన్‌గా పనిచేశాడు. అదేవిధంగా 2021 సెప్టెంబరు 16న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) చైర్మన్‌గా నియమితులై సెప్టెంబరు 20న బాధ్యతలు చేపట్టారు.


Next Story

Most Viewed