సోషల్ వెల్ఫెర్ కలుషిత ఆహార ఘటనలో బాలుడు మృతి

by Disha Web Desk 4 |
సోషల్ వెల్ఫెర్ కలుషిత ఆహార ఘటనలో బాలుడు మృతి
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలో విషాదం నెలకొంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోచంపల్లి మండలం జబ్లక్ పల్లికి చెందిన చిన్నలచ్చి ప్రశాంత్ అనే విద్యార్థి మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈనెల 12వ తేదిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కాగా పలువురు విద్యార్థులు తీవ్రంగా అస్వస్థతకు గురి అయ్యారు. ఇందులో ప్రశాంత్‌తో పాటు మరో విద్యార్థి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. వీరి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని జూబ్లీహిల్స్‌లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. వీరిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ మృతి చెందాడు. ప్రశాంత్ పాఠశాలలో ఐదవ తరగతిలో చేరి ప్రస్తుతం ఆరవ తరగతి చదువుతున్నాడు. ఇంటికి దూరంగా సంక్షేమ వసతి గృహాలలో ఉండి చదువుకునే విద్యార్థి వసతి గృహ సిబ్బంది నిర్లక్ష్యంతో మృతి చెందడం పట్ల జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు వెళ్లివెత్తుతున్నాయి. ప్రశాంత మృతితో స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.


Next Story

Most Viewed