‘రాజగోపాల్ రెడ్డి ఓ పాసింగ్ క్లౌడ్’.. రాజీనామాపై ఘాటుగా స్పందిస్తోన్న బీజేపీ లీడర్స్

by Satheesh |
Union Minister Kishan Reddy Asks CM KCR for Evidence Of Cloudburst
X

దిశ, వెబ్‌డెస్క్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ రాజీనామా చేయడంపై బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్‌పై పోరాటంలో బీజేపీ ఢీలా పడిందని.. బీఆర్ఎస్‌కు ప్రత్యమ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరి ఊహలు వారివి.. ఎవరి ఇష్టం వారిదని అన్నారు. కానీ బీజేపీ పోటీలో లేదని వారు అనుకుంటే సరిపోతుందా అని కౌంటర్ ఇచ్చారు.

ఇక, కోమటిరెడ్డి రాజీనామాపై బీజేపీ సీనియర్ జితేందర్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి ఓ పాసింగ్ క్లౌడ్ అని అన్నారు. పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుంది.. కొందరు అలా వచ్చి ఇలా వెళ్తారని కౌంటర్ ఇచ్చారు. ఇక, వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాని జితేందర్ రెడ్డి మనసులోని మాట బయటపెట్టారు.



Next Story