'భైంసా వెళ్లాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుందేమో'

by Disha Web Desk 2 |
భైంసా వెళ్లాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుందేమో
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బైంసా ప్రాంతమే బొందలగడ్డ అవుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడంపై సోమవారం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భైంసా భారత్‌లో భాగం కాదా అని, తెలంగాణలో లేదా అని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్‌లో భైంసాకు వెళ్లాలంటే వీసా తీసుకొని వెళ్లాల్సి వస్తుందేమోనని ఆయన ఎద్దేవా చేవారు. భైంసాలో శాంతి భద్రతలను అదుపుచేయలేని సీఎం రాష్ట్రాన్ని ఎలా కాపాడుతాడని ఆయన ప్రశ్నించారు. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు కేసీఆర్ ప్రాణం, టీఆర్ఎస్ బలహీనత పాతబస్తీ, భైంసాలో ఉందని విమర్శలు చేశారు.

అందుకే భైంసా, పాతబస్తీ పేరు విన్నా ఒక్కసారే ఉలిక్కి పడుతారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండేళ్ల క్రితం భైంసాలో 40 మంది అమాయక హిందువుల ఇండ్లను తగులపెట్టారని, కశ్మీర్ లో పండిట్లపై జరిగిన దాడికి ఇది ఏమాత్రం తీసిపోలేదన్నారు. హిందువులకు ఇలాంటి దుస్థితి పట్టడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం తన రాజకీయ లబ్ధికోసం తోడేళ్ళ గుంపును సాకుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భైంసాను ఎవరికైనా కౌలుకు ఇచ్చారా అని ప్రశ్నించారు. సీఎం ఎనిమిదేండ్ల పాలనలో భైంసాలో అడుగుపెట్టే పరిస్థితి లేకపోతే మరో నాలుగేళ్లు కేసీఆర్ సీఎంగా కొనసాగితే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పాతబస్తీ, మండలానికో భైంసా పుట్టుకొస్తాయన్నారు. బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్ర, టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో గునపమై గుచ్చుకుంటోందని, అందుకే ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారని ఫైరయ్యారు.


Next Story