జల మండలిని ముట్టడించిన బీజేపీ.. కార్పొరేటర్లు పోలీసులకు మధ్య ఉద్రిక్త పరిస్థితి

by Disha Web Desk 12 |
జల మండలిని ముట్టడించిన బీజేపీ.. కార్పొరేటర్లు పోలీసులకు మధ్య ఉద్రిక్త పరిస్థితి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల నాలాలో పడి చనిపోయిన మౌనిక మృతికి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం జల మండలి ముట్టడికి యత్నించారు. నిరసనగా జల మండలి ఎదుట బైఠాయించారు. దీంతో కార్పొరేటర్లకు, పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితిలో కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ.. అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని వాపోయారు. గ్రేటర్ పరిధిలో నాలాలో పడి చిన్నారి మృతి చెందడంపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. గతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీటి పైపుల కోసం రోడ్లు తవ్వి వదిలేస్తున్నారని ఆరోపణలు చేశారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed