బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే: మహేష్​ కుమార్ ​గౌడ్​

by Disha Web Desk 19 |
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే: మహేష్​ కుమార్ ​గౌడ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ​ప్రభుత్వం పైసలు కోసం పేపర్లు అమ్ముకుంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ ​కుమార్ ​గౌడ్​ ఆరోపించారు. ప్రభుత్వంలో విచిత్ర వైఖరి నెలకొన్నదన్నారు. విచ్చలవిడి నిర్లక్ష్యంతో సర్కార్ ​కొనసాగుతుందని ఆయన సోమవారం మీడియాకు తెలిపారు. విద్యార్ధులు, నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతుందన్నారు. టీఎస్​పీఎస్సీ లీకేజ్ ​అంశం మరువకముందే.. టెన్త్​ప్రశ్న పత్రం లీక్ ​కావడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ప్రభుత్వానికి పాలనపై అవగాహన లేదన్నారు. లక్షల మంది నిరుద్యోగులు, విద్యార్ధుల జీవితాలతో సర్కార్​ చెలగాటమాడుతుందన్నారు. బీఆర్ఎస్ ​ప్రభుత్వంలో విద్యావ్యవస్థ అట్టడుగుకు వెళ్లిందన్నారు.

లాభాల కోసం పేపర్లు అమ్మడాన్ని చరిత్రలో చూడలేదన్నారు. కేసీఆర్​ఫ్యామిలీ రాష్ట్రాన్ని అమ్మేసేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. పేపర్​లీకేజ్‌లపై కాంగ్రెస్​పార్టీ సంపూర్ణంగా పోరాడుతుందన్నారు. విద్యార్ధులు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వెనకడుగు వేయమని ఆయన నొక్కి చెప్పారు. పేపర్​లీకేజీలపై వెంటనే సీబీఐ, సిట్టింగ్ జడ్జిలతో ఎంక్వైరీ చేయించాలని కోరారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒకటేనని మహేష్​కుమార్​గౌడ్​మరోసారి స్పష్టంచేశారు. ఒకరికొకరు సపోర్టు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్​విజయ శంఖాన్ని మోగిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed