- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్! ‘ఇంటింటికి బీజేపీ’కి ఇద్దరు కీలక నేతలు దూరం

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ బీజేపీ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ లీడర్లు దూరంగా ఉండటం హాట్ టాపిక్ మారింది. కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవిపై ఈటలకు ఇప్పటివరకు హై కమాండ్ నుంచి హామీ లభించకపోవడంతో ఈట అసంతృప్తిలో ఉన్నట్లు తెలిసింది.
ఈటలకు వ్యతిరేకంగా ఇటీవల బండి సంజయ్ వర్గం వ్యూహాత్మాక సమావేశం పెట్టడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో యాక్టివ్ అవ్వడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఇన్ యాక్టివ్ కావడం సంచలనంగా మారింది. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి ఇద్దరు ముఖ్య నేతలు దూరంగా ఉండటంతో కమలం పార్టీకి నేతలు షాక్ ఇవ్వనున్నారా అనే చర్చ సాగుతోంది.
Read more : పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి సైలెంట్?