ఇక్కడే పుట్టా.. ఇక్కడే చస్తా.. నా శ్వాస, నా ధ్యాస కాంగ్రెస్: బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
ఇక్కడే పుట్టా.. ఇక్కడే చస్తా.. నా శ్వాస, నా ధ్యాస కాంగ్రెస్: బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారని, అందరూ నవంబర్ 30 కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం మొదలైందని ఎక్కడ చూసినా కాంగ్రెస్ మాటే వినిపిస్తోందన్నారు. బుధవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. సోనియాగాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి దూసుకు వస్తున్నారని అన్నారు. తెలంగాణలో జనసేన ప్రభావం ఉండబోతున్నదా అని అని అడిగి ప్రశ్నకు బదులిస్తూ.. పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం మాకు వచ్చు. కానీ దేశం కోసం త్యాగాలు చేసింది ఎవరు..? తెలంగాణ ఇచ్చింది ఎవరు అన్నారు. దేశం కోసం రాజీవ్ గాంధీ బాడీ ముక్కులు ముక్కలైందని.. ఆయన డెడ్ బాడీ ముక్కలు ఏరుకుని శ్మశానానికి రాహుల్ వెళ్లారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవరు పడితే వారు రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ఏనాడు హద్దు దాటి మాట్లాడలేదని కానీ కొంత మంది మిడిమిడి జ్ఞానంతో ఎగిరెగిరి పడుతున్నారని, అహంకారం తలకెక్కిన వారందరికీ నవంబర్ 30న జరగబోయే మహా కురుక్షేత్రంలో ఓటరు దేవుళ్లే తీర్పు ఇస్తారన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. నా శ్వాస, నా ధ్యాస కాంగ్రెస్ అని.. కాంగ్రెస్‌లోనే పుట్టాను కాంగ్రెస్‌లోనే చస్తానన్నారు. పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డ కార్యకర్తను నేను అని చెప్పారు. ఎవరు మంత్రి ఉంటారనేది ముఖ్యం కాదు కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తన లక్ష్యం అని చెప్పారు.

Next Story

Most Viewed