Bandi Sanjay Arrested: వందకు పైగా కాల్స్ మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు

by Disha Web Desk 4 |
Bandi Sanjay Arrested: వందకు పైగా కాల్స్ మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: పేపర్ లీకేజీ కంటే ముందే బండి సంజయ్ తో నిందితుడు ప్రశాంత్ చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బండి సంజయ్ తో ప్రశాంత్ వందకు పైగా కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు క్లారిటీకి వచ్చారు. నిన్న పేపర్ బండి కి పంపిన తర్వాత ప్రశాంత్ బీజేపీ చీఫ్ తో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రశాంత్ వాట్సాప్ ను పోలీసులు రిట్రీవ్ చేశారు. పేపర్ లీక్ కన్నా ముందు రోజు సైతం బండి సంజయ్‌తో నిందితుడు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.

తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ ను వరంగల్ సీపీ రంగనాథ్ ధృవీకరించారు. 10 వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆ తర్వాత ప్రచారాల్లో బండి సంజయ్ హస్తం ఉందని తెలిపారు. వాటి ఆధారంగానే బండిపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 420, 120B, సెక్షన్ 5 ఆఫ్ మాల్ ప్రాక్టీస్, సీఆర్పీసీ 154, 157 కింద కేసులు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీపీ రంగనాథ్ మూడు గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. అయితే హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ ని నిన్న అర్ధరాత్రి కరీంనగర్ లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed