అజారుద్దీన్ రివర్స్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎదుటే సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
అజారుద్దీన్ రివర్స్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎదుటే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 25న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకం తీవ్ర గందరగోళానికి దారితీసింది. టికెట్ల కోసం సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్ వద్దకు అభిమానులు భారీగా చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు చేయిదాటిపోవడంతో పోలీసులు లాఠీ‌చార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్, హెచ్‌సీఏ అధ్యక్షడు అజారుద్దీన్, ఇతర సిబ్బందితో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో అజారుద్దీన్ మంత్రి ఎదుటే రివర్స్ అయ్యారు. మీ దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్పడానికి తనకు టైమ్ లేదని.. మ్యాచ్ నిర్వహణే తనకు ముఖ్యమని ఘాటుగా స్పందించారు. ఇంత పెద్ద మ్యాచ్ నిర్వహించేటప్పుడు చిన్నాచితక ఘటనలు జరుగుతాయని.. టికెట్ల కోసం జరిగిన లాఠీచార్జ్, తొక్కిసలాట ఘటనలను అజారుద్దీన్ లైట్ తీసుకున్నారు. టికెట్ల కోసం జరిగిన ఆందోళనలో తమ తప్పేమీ లేదని అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. మ్యాచ్ నిర్వహణ అంటే.. ఇక్కడ మీటింగ్‌లో కూర్చొని మాట్లాడినంత ఈజీ కాదని అన్నారు.

మ్యాథ్స్ భయాన్ని పోగొట్టే 'భాన్జు'.. అత్యంత వేగవంతమైన హ్యూమన్‌ కాలిక్యులేటర్‌


Next Story