లోక్‌సభ ఎన్నికలకు సమన్వయకర్తల నియామకం.. అందరూ సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపు

by Disha Web Desk 1 |
లోక్‌సభ ఎన్నికలకు సమన్వయకర్తల నియామకం.. అందరూ సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ముమ్మరం చేసేందుకు సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నేతలు, కేడర్ మధ్య సమన్వయం కోసం సమన్వయకర్తలను నియమిస్తుంది. అందులో భాగంగా మంగళవారం 9 పార్లమెంట్ స్థానాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమన్వయకర్తలను నియమించారు. వరంగల్, కరీంనగర్, మెదక్, జహీరాబాద్, పెద్దపల్లి, భువనగిరి, నల్లగొండ, నాగర్ కర్నూల్, నిజామాబాద్ లకు నాయకులకు బాధ్యతలు అప్పగించారు. పార్టీ విజయం కోసం పనిచేయాలనిసూచించారు. మండలాలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి కేడర్ ను యాక్టీవ్ చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని వాటిని ప్రధానఅస్త్రంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచించారు.

వ‌రంగ‌ల్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల సమన్వయకర్తలు ఇలా..

పరకాల – ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్, పాలకుర్తి – ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, స్టేషన్ ఘనపూర్ – ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ వెస్ట్ – మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కుడా చైర్మన్ సుందర్ రాజ్, వరంగల్ ఈస్ట్ – ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వర్ధన్నపేట – వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవారెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ సమ్మారావు, భూపాలపల్లి – ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య.

మెద‌క్ పరిధిలో...

సంగారెడ్డి – కార్పిరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పటాన్‌చెరు – మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, నర్సాపూర్ – ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మెదక్ – డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, దుబ్బాక – పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్ రావు, గజ్వేల్ – జ‌డ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, సిద్దిపేట – మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్.

క‌రీంన‌గ‌ర్ పరిధిలో...

కరీంనగర్ – ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, సిరిసిల్ల –జ‌డ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, వేములవాడ – కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, చొప్పదండి – మాజీ చైర్మన్ భూపతి రెడ్డి, హుజురాబాద్ – మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మానకొండూర్ – టీఎస్ క్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, హుస్నాబాద్ – ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు.

జ‌హీరాబాద్ పరిధిలో...

జహీరాబాద్ – మాజీ చైర్మన్ దేవిశ్రీప్రసాద్ రావు, ఆందోల్ – డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, నారాయణఖేడ్ – మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, కామారెడ్డి – మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, ఎల్లారెడ్డి – మాజీ చైర్మన్ తిరుమల్ రెడ్డి, బాన్సువాడ – జడ్పీ చైర్మన్ ధఫెదర్ రాజు, జుక్కల్ – డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి.

పెద్దప‌ల్లి పరిధిలో..

చెన్నూరు – మంచిర్యాల జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి – ఓదెల జడ్పీటీసీ గంట రాములు, మంచిర్యాల – కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, రామగుండం – మాజీ కార్పొరేషన్ చైర్మన్ సీహెచ్ రాకేష్, మంథని – పార్టీ సీనియర్ నాయకుడు ఓరుగంటి రమణా రావు, పెద్దపల్లి – కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్, ధర్మపురి – గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్.

భువ‌న‌గిరి పరిధిలో..

ఇబ్రహీంపట్నం – మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మునుగోడు – జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, భువనగిరి – నాయకుడు నంద్యాల దయాకర్ రెడ్డి, నకిరేకల్ – ఎలిమినేటి సందీప్ రెడ్డి, జడ్పీ చైర్మన్, తుంగతుర్తి – మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, ఆలేరు – ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, జనగామ – పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి.

న‌ల్లగొండ పరిధిలో..

నల్లగొండ – మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, నాగార్జున సాగర్ – జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, హుజూర్ నగర్ – రాష్ట్ర నాయకుడు ఒంటెద్దు నరసింహా రెడ్డి, దేవరకొండ –జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, మిర్యాలగూడ – మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ – కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, సూర్యాపేట – మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రా నాయక్.

నాగ‌ర్‌క‌ర్నూల్ పరిధిలో..

నాగర్ కర్నూలు – కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్య నాయక్, గద్వాల – మాజీ చైర్మన్ ఎండీ ఇంతియాజ్ అహ్మద్, అలంపూర్ –మాజీ చైర్మన్ దేవర మల్లప్ప, కల్వకుర్తి – పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, వనపర్తి – పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్, అచ్చంపేట – రాష్ట్ర నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి, కొల్లాపూర్ – సాట్స్ మాజీ చైర్మన్ డా. ఆంజనేయ గౌడ్.

నిజామాబాద్ పార్లమెంట్

కోరుట్ల– ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఆర్మూర్ – మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, నిజామాబాద్ అర్బన్ – నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ చైర్మన్ అలీం, బాల్కొండ – గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్, నిజామాబాద్ రూరల్ – మాజీ ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్, బోధన్ – జడ్పీ చైర్మన్ డి.విఠల్ రావు, జగిత్యాల– జడ్పీ చైర్మన్ దావా వసంత, మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి నియామకం అయ్యారు.


Next Story