- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హైదరాబాద్‌లో మరో ఘోర అగ్నిప్రమాదం
by GSrikanth |

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నగరంలోని పాతబస్తీలోని మదీనా బిల్డింగ్‌లో ఉన్న జాకీ గార్మెంట్స్ షో రూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధి మదిన సర్కిల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఘటనా స్థలాన్ని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల బజార్‌ఘాట్ అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అగ్నిప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
Next Story