అరుదైన వృక్షానికి పూలమాల వేసి పర్యావరణ ఉద్యమకారుడి వినూత్న పోరాటం

by Disha Web Desk 4 |
అరుదైన వృక్షానికి పూలమాల వేసి పర్యావరణ ఉద్యమకారుడి వినూత్న పోరాటం
X

దిశ , కోదాడ టౌన్ : అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ వినూత్నంగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సోమవారం మున్సిపల్ మరియు అటవీ శాఖ అధికారుల సమక్షంలో పట్టణంలోని అశోక్ నగర్ వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న అరుదైన వృక్షానికి పూలమాల వేశారు. వృక్షాన్ని రక్షించాలని పర్యావరణ రక్షణ నినాదాలతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వృక్షం ఆఫ్రికన్ జాతికి చెందిన అదన్ సోనియా డిజిటేటా లీన్ అనే అరుదైన జాతికి చెందిన వృక్షం అన్నారు. ఇప్పటికే వృక్షం ఉన్న చోట ఖాళీ స్థలాన్ని నిర్మాణ నిమిత్తం సిద్ధం చేసారని, ఆ వృక్షానికి ఎప్పుడైనా ప్రమాదం కలుగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొట్టా రమేష్, రాయపూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed