స్టార్ హీరో పక్కన ఆ పాత్ర కోసం రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయనతార..

by Kavitha |
స్టార్ హీరో పక్కన ఆ పాత్ర కోసం  రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయనతార..
X

దిశ, సినిమా: తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార అందరికీ సుపరిచితమే. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ సౌత్ లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాకుండా ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన క్రేజ్ ను పెంచుకుంటుంది. సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం(ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు) అందుకుంటున్న బ్యూటీనే. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు, నాలుగు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో దూసుకుపోతుండగా.. కేజిఎఫ్ హీరో యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో యష్ కు అక్కగా నయన్ నటించబోతుందని టాక్. మరి నిజంగానే నయన్ అక్క రోల్ కి ఒప్పుకుందా లేదా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో ముందుగా అక్క రోల్ కోసం బాలీవుడ్ భామ కరీనా కపూర్ ను అనుకున్నారు. కానీ డేట్ ఇష్యూల వల్ల ఆమె తప్పుకుందట.

ఈ భామ ఈ మూవీ కోసం ఏకంగా రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కేజీఎఫ్ 2 లాంటి సూపర్ హిట్ తర్వాత యష్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత 'టాక్సిక్' అనే సినిమా చేస్తున్నట్లు ఈ మధ్య అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తు్ండగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయక్తంగా నిర్మిస్తున్నాయి.. కాగా, అనౌన్స్ మెంట్ టైమ్ లోనే ఈ సినిమా ను ఏప్రిల్ 10, 2025 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. .

Read More...

ఈ స్టార్ హీరోతో అలా చేయడానికి 5 కోట్ల క్రేజీ ఆఫర్.. కాదని చెప్పి షాక్ ఇచ్చిన హీరోయిన్..!Next Story

Most Viewed