అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు.. ప్రచార వ్యూహంపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన

by Disha Web Desk 13 |
అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు.. ప్రచార వ్యూహంపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఈనెల 25న కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. బహిరంగ సభ పెట్టాలా? పార్టీ సమావేశం నిర్వహించాలా అనేది నిర్ణయం తీసుకుంటామన్నారు. రేపు, ఎల్లుండి బన్సల్ తెలంగాణలో పర్యటిస్తారని పెద్ద సభలు, సమావేశాల కంటే డోర్ టు డోర్ ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వచ్చే నెల 13 వరకు నిర్మాణాత్మకంగా ప్రచారం సాగుతుందని చెప్పారు. శనివారం పార్టీ స్టేట్ ఆఫీస్ లో బీజేపీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కు బీ ఫామ్ అందజేసిన కిషన్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

కామారెడ్డిలో కేసీఆర్ ను తొక్కింది సరిపోలేదా?

కేటీఆర్ జైశ్రీరామ్ అన్నం పెడుతుందా అంటున్నాడు.. జై శ్రీరామ్ చెప్పి బీజేపీని తొక్కండి అంటాడు. కామారెడ్డిలో కేసీఆర్ ను తొక్కింది సరిపోలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏం చెప్పి ఓట్లు అడుగుతారని ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కాకుండా ఉనికి కోసం ప్రయత్నిస్తే బెటర్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ దగాకోర్ పార్టీ అని.. ఎన్నికల కోడ్ ను సాకుగా చెబుతూ పథకాల అమలును దాటవేస్తోందని ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారని ప్రశ్నించారు. జూన్ 4 తో ఎన్నికల కోడ్ ముగుస్తుంటే ఆ మరుసటి రోజే రైతు రుణమాఫీ చేయకుండా ఆగస్టు వరకు ఎందుకు పెండింగ్ పెడుతున్నారని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే వృథా అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే కేసీఆర్ కూడా కాంగ్రెస్ బ్రాండే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ బడే మియా అయితే బీఆర్ఎస్ చోటా భాయ్ అని సెటైర్ వేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు అయిందని.. రాబోయే నాలుగున్నరేండ్ల తర్వాత కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయం అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో కేసీఆర్ ప్రస్టేషన్ లో ఉన్నారని ఆ పార్టీ అధికారం కోల్పోయి 5 నెలలు గడిచినా కేసీఆర్, కేటీఆర్ ఇంకా ఓటమిని అంగీకరించడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ స్కామ్, బీరు బ్రాందీ స్కామ్ లో బీఆర్ఎస్ ఇరుక్కుపోయిందని ధ్వజమెత్తారు. రేవంత్ ముఖ్యమంత్రి అనే విషయం తెలుసుకుని మాట్లాడాలని ఆయనింకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గాలి మాటలు మాట్లాడుతున్నాయని, బీజేపీపై బేస్ లెస్ ఆరోపణలు చేయొద్దని హెచ్చరించారు.



Next Story

Most Viewed