వామపక్షాలకు సీట్ల కేటాయింపు.. కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

by Disha Web Desk 4 |
వామపక్షాలకు సీట్ల కేటాయింపు.. కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!
X

దిశ, తెలంగాణ బ్యూరో : వామపక్షాలకు నాలుగు సీట్లు ఎక్కువేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టుల ఓట్లు ఎంత వరకు ట్రాన్స్ ఫర్ అవుతుందనే అంశంపై పార్టీ ఇంటర్నల్ గా అధ్యయనం జరుపుతుందన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు పక్కా అన్నారు. టిక్కెట్ల కేటాయింపులో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయమే ఫైనల్ అన్నారు. కాంగ్రెస్ లో చాలా మంది చేరుతున్నారని, ఇంకా చేరికలు పెరుగుతాయన్నారు. రాజగోపాల్ రెడ్డి చేరిక విషయం నేరుగా అధిష్టానంతోనే మాట్లాడారన్నారు. తనకు సమాచారం లేదన్నారు. కర్ణాటకలో హామీ ఇచ్చిన స్కీమ్స్ అమలు అవుతున్నాయని, ఇక్కడ ఇచ్చిన గ్యారంటీలను కూడా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు.

సెకండ్ లిస్టులోనే అన్ని సెగ్మెంట్ లు ప్రకటించే అవకాశం ఉన్నదన్నారు. సీఈసీ నిర్ణయం ఫైనల్ అయ్యే వరకు ఎవరూ బయట మాట్లాడవద్దని సూచించారు. ఇక గతంలోనే కాళేశ్వరం మీద విచారణ జరపాలని ప్రధానికి లేఖ రాశానని, కానీ ఇప్పటి వరకు దానిపై స్పందన లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటయ్యాయని ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చిందన్నారు. పైగా రాహుల్ గాంధి పేరు చెప్పే అర్హత కేటీఆర్‌కి లేదన్నారు. రాహుల్ గాంధీకి ఇప్పటి వరకు ఇల్లు కూడా లేదని, కానీ కేటీఆర్‌కు ఎన్ని ఆస్తులున్నాయో? అతనికే తెలియదన్నారు. నల్గొండ ప్రజల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. గెలిచిన ఎమ్మెల్యేలు గెలిపించిన నాయకులని మరచిపోతున్నారని, కానీ తానేప్పుడు కార్యకర్తల సంక్షేమం కోసమే కృషి చేస్తానని పేర్కొన్నారు.

Next Story

Most Viewed