అలర్ట్ : మరో ప్రాణాంతక వైరస్.. సంచలన విషయాలు వెల్లడించిన డబ్ల్యూహెచ్‌వో

by Disha Web Desk 4 |
అలర్ట్ : మరో ప్రాణాంతక వైరస్.. సంచలన విషయాలు వెల్లడించిన డబ్ల్యూహెచ్‌వో
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా మానవాళి జీవన స్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అనేక మందిని పొట్టన బెట్టుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కరోనా కారణంగా దేశాలకు దేశాలు లాక్ డౌన్ లో కాలం వెల్లదీశాయి. కాగా మానవాళిపై మరో ప్రాణాంతక వైరస్ ముప్పు వచ్చిపడింది.

మార్ బర్గ్ వైరస్ డిసీస్(ఎంవీడీ) గా పిలిచే ఈ వైరస్ తొలి కేసు పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ఈ క్వటోరియల్ గినియాలో నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌వో సంస్థ నిర్ధారించింది. విపరీతమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఆయాసం, రక్తపు వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పుల వంటివి ఈ వైరస్ లక్షణాలని తెలిపింది. ఈ వ్యాధి తొలిసారిగా 1967లో నమోదైంది.

ఈ ప్రాణాంతక వైరస్‌కు చికిత్స లేక పోవడం తీవ్ర కలవరం రేపుతోంది. ఈ వైరస్ ఎబోలాను పోలి ఉంటుందని పేర్కొంది. గినియాలోని కీటెం ప్రావిన్స్ లో దీని బారిన పడిన 9 మంది మరణించారని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఈ వైరస్ కు చికిత్స గానీ, వ్యాక్సిన్ గానీ అందుబాటులో లేదని తెలిపింది. వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగాల దశలో ఉన్నాయని స్పష్టం చేసింది.

Also Read...

దేశంలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్ పై రూ. 22.20 పెంపు



Next Story

Most Viewed