సీఎం కేసీఆర్‌ను పరీక్షించిన వైద్యులు ఏం చెప్పారంటే?

by Disha Web Desk 2 |
సీఎం కేసీఆర్‌ను పరీక్షించిన వైద్యులు ఏం చెప్పారంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్వల్ప అస్వస్థత కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం గచ్చిబౌలిలోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌కు డాక్టర్స్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎండోస్కోపి, సిటీ స్కాన్ నిర్వహించిన వైద్యులు, ఆయనకు అల్సర్‌ ఉన్నట్టుగా నిర్ధారించారు. ఈ మేరకు హెల్త్ చెకప్ రిపోర్టును విడుదల చేశారు. ‘సీఎం కేసీఆర్‌కు ఈరోజు ఉదయం పొత్తి కడుపులో అసౌకర్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి కేసీఆర్‌ను పరీక్షించారు.

ఆ తర్వాత ఆయనను ఏఐజీ ఆస్పత్రికి తీసుకురావడం జరిగింది. ఆస్పత్రిలో కేసీఆర్‌కు సీటీ, ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించారు. అల్సర్ ఉన్నట్లుగా తేలింది. తగిన మెడికేషన్ ప్రారంభించాం’ అటని ఏఐజీ ఆస్పత్రి పేర్కొంది. ఇదిలా ఉంటే, కేసీఆర్ ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారనే విషయం మాత్రం ఆస్పత్రి వర్గాలు వెల్లడించలేదు. మరోవైపు కేసీఆర్‌తో పాటు ఆస్పత్రిలో పలువురు కుటుంబ సభ్యులు, కొందరు మంత్రులు కూడా ఉన్నారు.



Next Story

Most Viewed