హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోడీ.. రాజ్‌భవన్‌లో బస

by Disha Web Desk 1 |
హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోడీ.. రాజ్‌భవన్‌లో బస
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ అనుకున్న షెడ్యూల్ కంటే ముందే తెలంగాణకు చేరుకున్నారు. మంగళవారం రాత్రి 8:10 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి రాజ్ భవన్‌కు వచ్చారు, రాత్రి అక్కడే బస చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన వేములవాడ, వరంగల్‌లో ప్రచారం నిర్వహించాల్సి ఉంది. కాగా, బుధవారం ఉదయం ఆయన 9:25 గంటలకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడకు‌కు బయలుదేరుతారు. 10 గంటలకు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం వేములవాడ బైపాస్ సమీపంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు హాజరవుతారు.

10:30 నుంచి 11:15 వరకు పబ్లిక్ మీటింగ్‌లో మోడీ ప్రసంగిస్తారు. ఈ పబ్లిక్ మీటింగ్ ముగిశాక నేరుగా అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 11:30కి బయలుదేరుతారు. 11:55 గంటలకు వరంగల్‌కు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:15 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మామునూరు విమానాశ్రయం సమీపంలో నిర్వహిస్తున్న సభకు ఆయన హాజరై ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా షెడ్యూల్‌లోనూ మార్పులు చోటు‌చేసుకున్నాయి. బుధవారం రాత్రికే అమిత్‌షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. 9న ఉదయం 9 గంటలకు భువనగిరిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర‌నర్సయ్య గౌడ్ తరుపున ప్రచారం చేస్తారు. కాగా, వాస్తవానికి ఆయన 9న చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి తరుపున ప్రచారం చేయాల్సి ఉండగా దాన్ని మార్చుకున్నారు.

Read More...

HYD: నగరవాసులకు బిగ్ అలర్ట్.. ప్రధాని మోడీ రాకతో నేడు, రేపు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

Next Story

Most Viewed