లోకసభలో AICC ఇంచార్జ్ Manikkam Tagore వాయిదా తీర్మానం

by Disha Web Desk |
లోకసభలో AICC ఇంచార్జ్ Manikkam Tagore వాయిదా తీర్మానం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ టీమ్ హెడ్ సునీల్ కనుగోలు ఆఫీసును (కాంగ్రెస్ వార్ రూమ్ ) సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం నాడు రాత్రి సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో లోకసభలో ఏఐసీసీ ఇంచార్జ్ ఎంపీ.మనిక్కమ్ ఠాగూర్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. నిన్న రాత్రి హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌లో పోలీసులు దౌర్జన్యం చేసి కంప్యూటర్లు స్వాధీనం చేసుకోవడం, నాయకులను అరెస్టులు చేయడం తదితర అంశాలపై అత్యవసరంగా చర్చించాలని వాయిదా తీర్మానం కోరారు. వారెంట్ లేకుండా వచ్చి అరెస్టు చేశారని అన్నారు. మరోవైపు, ఫేస్ బుక్ పోస్ట్‌లు పెట్టామని ఆరోపిస్తూ దౌర్జన్యంగా తెలంగాణ పోలీసులు కార్యాలయంపైన దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో కాంగ్రెస్ కు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దక్షిణ భారత హిట్లర్‌గా మారారని మానిక్కమ్ ఠాగూర్ ఎద్దేవా చేశారు. దీనిపై చర్చ కోరుతూ మాణిక్కం ఠాగూర్ తీర్మానం చేశారు.

Also Read....

హిందీ కలిపింది ఆ ఇద్దరు రాష్ట్ర కీలక నేతలని?

Next Story

Most Viewed