టీఆర్ఎస్, బీజేపీ కలిసి నాటకాలాడుతున్నాయి: Addanki Dayakar ఫైర్

by Disha Web |
Addanki Dayakar Says Takes His Words back  On Komatireddy Venkat Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణను ప్రయోగశాలగా మార్చాలని చూస్తున్నారని అన్నారు. మతంతో విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ దేశాన్ని ఏలాలని చూస్తోందని మండిపడ్డారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా బీజేపీ వ్యవహరిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి నాటకాలాడుతున్నాయని.. తెలంగాణ ప్రజలు దీనిని గమనించాలని సూచించారు.

ఇదిలా ఉండగా, తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వివాదం కొనసాగుతోంది. టీ బీజేపీ చీఫ్ బండి అంజయ్ అరెస్ట్, ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌తో తెలంగాణ పాలిటిక్స్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి.


Next Story