ఆశల పల్లకిలో నిరుద్యోగులు..!

by Disha Web Desk 22 |
ఆశల పల్లకిలో నిరుద్యోగులు..!
X

దిశ, మందమర్రి: ఆ రండి బాబు రండి. మూడు లక్షలు కొట్టండి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగం పట్టండి' అంటూ ఒక ఏజెన్సీ, కొంతమంది బ్రోకర్లు గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వల వేస్తున్నారు. ఈ ముఠా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల అమ్మకాల పేరిట లక్షల రూపాయలు దండుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. లక్షల రూపాయలు ధారపోసి ఉన్నత విద్యను అభ్యసించి ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలు లేక మరోవైపు భార్య పిల్లలను పోషించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుద్యోగులను ఈ సంస్థ టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ సంస్థ పేరుతో కొంత మంది నిర్వాహకులు సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతానికి చెందిన అమాయకులను వారి ధన దాహానికి వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ మాఫియా సభ్యులు కొన్ని రద్దీ ప్రదేశాలను పెంచుకుంటారు. ఆ ప్రాంతంలో ఇతరులతో నేరుగా పరిచయం చేసుకుంటున్నారని సమాచారం. నీకు ఉద్యోగం కావాలా అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఖాళీగా ఉందని మా స్నేహితుడు చెప్పాడు. ఆ ఉద్యోగం కావాలి అంటే నాలుగు లక్షలట , కిందిస్థాయి ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం కావాలంటే మూడు లక్షల రూపాయలు అవుతుందని నమ్మిస్తున్నారని కథనం.

ఏ ఉద్యోగం కావాలన్నా ముందుగా రూ. 50 వేల అడ్వాన్స్‌గా చెల్లించాలని నిరుద్యోగులను ఆశల పల్లకిలోకి తీసుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత రూ. 50,000 నుంచి లక్ష రూపాయలు ఫోన్ పే లో తీసుకున్నట్లు సమాచారం. ఇలా వీరికి డబ్బులిచ్చిన విషయాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా పకడ్బందీగా ఈ ముఠా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఇదిగో, అదిగో అంటూ నెలల తరబడి నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో వాయిదాలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి మాటలు విని విని వేసారి పోయిన నిరుద్యోగులు తమ డబ్బులు తమకు ఇవ్వాలని సంస్థ నిర్వాహకులను ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ ఒత్తిడిని భరించలేక ఏజెన్సీ దళారి ముఠా ఒక ఫేక్ నియామక పత్రాన్ని బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఒక వ్యక్తికి అందజేసినట్లు సమాచారం.

ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం బయటకు వస్తే ఉద్యోగ నియామకలు నిలిచిపోతాయని సంబంధిత బాధితులకు ఆ సంస్థ సభ్యులు హుకుంలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానితో కోపోద్రిక్తులైన నిరుద్యోగులు ఈ ఉద్యోగం అసలుదా..? నకిలీదా..? అంటూ నిలదీసినట్లు తెలిసింది. ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిరుద్యోగులు మంచిర్యాల జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ ముఠా మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, కాసిపేట, బెల్లంపల్లి తదితర ప్రాంతాలలోని నిరుద్యోగుల దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసుల విచారణ చేపడితే కానీ బాధితుల సంఖ్య పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Next Story

Most Viewed