ఎన్నో ఉద్యమాల ఫలితమే నేటి తెలంగాణ : ప్రభుత్వ విప్ సుమన్

by Disha Web Desk 15 |
ఎన్నో ఉద్యమాల ఫలితమే నేటి తెలంగాణ : ప్రభుత్వ విప్ సుమన్
X

దిశ, మంచిర్యాల టౌన్ : ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ఫలితమే ఈ తెలంగాణ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మంచిర్యాలలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ , జిల్లా కలెక్టర్ బధవత్ సంతోష్ ,మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్ళి దివాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల కేంద్రంలోని అమర వీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం తెలంగాణ తల్లికి పూల మాల వేసి జై తెలంగాణ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.

కార్యక్రమంలో బాల్క సుమన్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ఫలితమే ఈ తెలంగాణ అని అన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో అద్భుతాల సమూహంగా తెలంగాణ మారింది, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన లో బంగారు తెలంగాణ సాధిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం మొదలు నేటి సచివాలయం వరకు తెలంగాణ ఖ్యాతిని చాటుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. దశాబ్ది ఉత్సవాలకు మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన, అడిషనల్ కలెక్టరు బి.రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి, జిల్లా శాఖల అధికారులు , బీఅర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed