పంచాయతీ పారిశుధ్య కార్మికుల జీతం డబ్బులు కాజేసిన సర్పంచ్..

by Disha Web Desk 20 |
పంచాయతీ పారిశుధ్య కార్మికుల జీతం డబ్బులు కాజేసిన సర్పంచ్..
X

దిశ, చింతలమానేపల్లి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని డబ్బా గ్రామ పంచాయితీలో పారిశుద్ధ కార్మికుల జీతాలు సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీలు కాజేశారంటు మంగళావారం గ్రామ పంచాయతీ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బా సర్పంచ్ తాహీరబేగం ఈ నెలలో పరిశుద్ధ కార్మికులు కొన్ని రోజులు విధులకు హాజరు కాలేదని జీతాల నుంచి పనిచేయని దినాలను చూసి జీతాలను కోత విధించారన్నారు. మేము నెల అంతా పనిచేసిన కూడా పనిచేయకుండా ఉన్నారని మాపై లేనిపోని నిందలు వేసి జీతం నుంచి కోత విధించడం ఏంటని ప్రశ్నించారు. కెలనెలకు సరిగా జీతాలు ఇవ్వడం లేదనారు. తమకు న్యాయం కావాలనే ధర్నా నిర్వహిస్తుమన్నారు. డబ్బులు కాజేసిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సరిగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సర్పంచ్ ను వివరణ కోరగా..

డబ్బా గ్రామ పంచాయతీలో పరిశుద్ధ కార్మికులుగా ఐదుగురిని మాత్రమే తీసుకోవాలని గ్రామపంచాయతీ తీర్మానం చేశాము. అయితే ఐదుగురిని సెలెక్ట్ చేయగా.. మరోఐదుగురు మేము కూడా సగం జీతానికైనా పనిచేస్తామని ఆ ఐదుగురు కార్మికులు బాండ్ పేపర్ రాసి ఇవ్వగా వారిని కూడా విధుల్లోకి తీసుకున్నాం. మొత్తం 10మంది పరిశుద్ధ కార్మికులతో పని చేపిస్తున్నాం. జీతాలు సరిగా ఇవ్వడం లేదని, కాజేశారని వస్తున్న ఆరోపణలు ఆవాస్తవమన్నారు. పదిమంది కార్మికుల భవిష్యత్తు గురించినేను ఆలోచిస్తే వారు నామీద ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఒక్కరు కూడా సరిగా విధులకు హాజరు కాలేకపోయిన సర్దుకుని పోతున్నామన్నారు.


Next Story