రాంజీ గోండుకు నిర్మల్ వేయి ఉరుల మర్రి వద్ద ఘన నివాళి

by Dishafeatures2 |
రాంజీ గోండుకు నిర్మల్ వేయి ఉరుల మర్రి వద్ద ఘన నివాళి
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఆదివాసులకు పోరాట పంథా నేర్పిన గోండు వీరుడు, బ్రిటిష్ సైన్యంపై గెరిల్లా పోరాటం చేసి అమరవీరుడైన ఆదివాసి బిడ్డ రాంజీ గోండుకు ఆదివారం ఘన నివాళి అర్పించారు. నాందేడ్ బ్రిటిష్ రెజిమెంట్ పై మెరుపు దాడులు చేసి మహారాష్ట్రలోని చంద్రపూర్ కేంద్రంగా ప్రత్యేక సైన్యాన్ని నడిపిన రాంజీ గోండుతో పాటు వెయ్యి మందిని నిర్మల్ సమీపంలోని వేయి ఉరుల మర్రి చెట్టుకు ఉరేసి చంపిన చరిత్ర ఇంకా చెరిగిపోలేదు. అలాంటి ధీరత్వాన్ని ప్రదర్శించిన రాంజీ గోండును స్మరిస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పించారు.

ఆసిఫాబాద్ ఉట్నూరు ఆదిలాబాద్ నిర్మల్ కేంద్రాల్లో ఆయన విగ్రహానికి ఆయన అమరత్వం పొందిన వేయి ఉరుల మర్రి వద్ద స్మారక స్థూపానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నిర్మల్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, రాంజీ గోండు సేవా సంఘం ప్రతినిధులు మొసలి చిన్నయ్య,l గోవర్ధన్, సూరపు సాయన్న, ముచ్చిండ్ల శంకర్, రమేష్, గంగాధర్, నాగరాజు, సతీష్, మహేష్, నారాయణ, రాములు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed