ఆ ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు..

by Disha Web Desk 20 |
ఆ ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు..
X

దిశ, సారంగాపూర్ : జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని మండల ప్రాథమిక పాఠశాల గ్రామం పొన్కూర్ (స్వర్ణ)లో పనిచేస్తున్న ఐదుగురు ఉపాధ్యాయులలో సోమవారం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే పాఠశాల విధులకు సమయానికి హాజరైనారయ్యారు. మిగతా నలుగురు ఉపాధ్యాయులు గైర్హాజరైనట్లు, వీళ్లు తరచుగా పాఠశాల విధులకు సమయానికి హాజరు కావడం లేదని, గైర్హాజరు ఆవుతున్నారని పోషకుల నుండి ఫిర్యాదు అందినట్లు, వీరి ఒకరోజు వేతనాన్ని నిలుపుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధీకారి డా.ఏ.రవీందర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు.

ఈ విషయమై మండల విద్యాధికారి, కాంప్లెక్స్ హెచ్ఎంల నుండి వివరణ తీసుకొనగా, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సోమవారం ఉదయం పాఠశాలను సందర్శించే సమయానికి కూడా వీరుఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు అయ్యారని, వీరు తరచుగా పాఠశాలకు గైర్హాజరు అవుతున్నారని, సమయపాలన పాటించడం లేదని తెలిసింది. ఈ విషయాన్ని గమనించి జిల్లావిద్యాశాఖ అధికారి, తనకు అందిన ఫిర్యాదు మేరకు, మండల ప్రాథమిక పాఠశాల పొన్కూర్ (స్వర్ణ) పాఠశాలకు సమయానికి హాజరుకాని నలుగురు ఉపాధ్యాయులు ఎం. మంగులాల్ (ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్), టి. శ్రీనివాస్ (ఎస్జీటీ), ఎం. గిరీష్ కుమార్ (ఎస్జీటీ), ఎం. శ్రీనివాస్ (ఎస్జీటీ) లకు షోకాజ్ నోటీసు ఇస్తూ, వారి ఒకరోజు వేతనాన్ని నిలుపుదల చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

గైర్హాజరు అయిన నలుగురు ఉపాధ్యాయుల ఒకరోజు వేతనాన్ని నిలుపుదల చేయాల్సిందిగా స్వర్ణ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు దశరథ్ ని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ పాఠశాల విధులకు సమయానికి హాజరుకావాలని, లేదంటే సదరు ఉపాధ్యాయుల పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీఈఓ తెలిపారు.



Next Story

Most Viewed