కొత్త కమిషనర్ కు సమస్యల స్వాగతం..

by Disha Web Desk 20 |
కొత్త కమిషనర్ కు సమస్యల స్వాగతం..
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మేజర్ గ్రామపంచాయతీని పెరుగుతున్న జనాభా దృష్ట్యా, గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని మేజర్ గ్రామపంచాయతీని అప్గ్రేడ్ చేసి మున్సిపాలిటీగా మార్చడానికి స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎంతో కృషి చేశారు. కానీ అధికారులు నిర్లక్ష్యం మున్సిపాలిటీలో సరైన నాయకత్వం లేకపోవడంతో మున్సిపాలిటీగా మారినప్పటికీ ప్రజలకు ఒరిగిందేమీ లేదు. టాక్స్ ల పేరుతో ప్రజలను ఇబ్బంది గురి చేయడం, నూతన గృహ నిర్మాణాల అనుమతుల కోసం ఆఫీసు చుట్టూ ఎన్నిసార్లు ప్రదర్శనలు చేసిన అనుమతులు దొరకకపోవడం కానీ ఇంటి యజమానుల దగ్గర లంచాలు కాజేసి ఇల్లీగల్ గా అనుమతులు ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీగా మారింది.

మున్సిపాలిటీ అయినప్పటి నుండి ప్రభుత్వ భూములలో అసైన్డ్ భూములలో యదేచ్చగా వెంచర్ల బాగోతం కొనసాగుతుంది. గతంలో ఒక కౌన్సిలర్ మున్సిపల్ ఆఫీసులో అసైన్డ్ భూములలో అనుమతి లేకుండా నిర్మించుకున్న ఇండ్లకు ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారని పత్రిక సమావేశం ఏర్పాటు చేసి బండారం బయట పెట్టినప్పటికీ అధికారుల్లో చలనం లేదు. గాంధీచౌక్ ప్రాంతానికి చెందిన ఇటీవల ఒక మహిళ చనిపోతే డెత్ సర్టిఫికెట్ కోసం ఎన్ని సార్లు ఆఫీస్ చుట్టూ తిరిగిన అధికారుల నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో తప్పని పరిస్థితులలో మున్సిపాలిటీలో ఒక ప్రధాన పదవిలో ఉన్న నాయకుడిని సంప్రదించగా అధికారులు తన మాటవినడం లేదని చెప్పడం సిగ్గుచేటని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.

నీటి సమస్య, రోడ్ల సమస్యలు నిత్యం ప్రజలను వెంటాడుతూనే ఉంటాయి. కనీసం పరిశుభ్రత కోసం ఏర్పాటు చేసిన 16 చెత్త ఆటోలను కూడా డీజిల్ నింపి వాడుకోకపోవడం డీజిల్ కు డబ్బులు లేవని చెప్పడం, డ్రైవర్లకు జీతాలు ఇవ్వకపోవడం. స్థానిక మున్సిపాలిటీలోని ప్రధాన సమస్య. గత సంవత్సరం నుండి మున్సిపాలిటీకి చెందిన ఒక చెత్త సేకరించి ఆటో మరమ్మత్తుల పేరుతో వరంగల్లోని గ్యారేజ్ లో ఉండడం ఇప్పటివరకు దాన్ని వాడకలోకి తీసుకురాక పోవడం వెనుక అంతర్యం ఏమిటని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.

ఆ ఆటో ఉన్నదా లేక ఎవరైనా దానిని అమ్ముకున్నారా అన్నది కూడా అంతుచిక్కని ప్రశ్న?. గత రెండు సంవత్సరాల నుండి తైబజార్ వేలంపాట వేయకుండా మున్సిపాలిటీలో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందితో డబ్బులు వసూలు చేయడం వసూలు చేసిన ఆ డబ్బులు ఎవరు కాజేస్తున్నారు. అన్నది కూడా పట్టణ ప్రజలను అయోమయానికి గురిచేస్తుంది. ప్రతినిత్యం ఎన్నో సమస్యలతో తలబడుతున్న స్థానిక మున్సిపాలిటీలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ గంగాధర్ సమస్యలను పరిష్కరించడంలో ఏ విధంగా విజయం సాధిస్తాడో వేచి చూడాల్సిందని పట్టణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed