Nirmal District Collector :నిర్మల్ కలెక్టర్ సరికొత్త ప్రయోగం..

by Disha Web Desk 20 |
Nirmal District Collector :నిర్మల్ కలెక్టర్ సరికొత్త ప్రయోగం..
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : రక్తహీనత కారణంగా సంభవించే మాతృత్వ మరణాలను అరికట్టేందుకు నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సరికొత్త కార్యక్రమానికి కలెక్టర్ పూనుకోవడం నిరుపేద కుటుంబాలకు చెందిన గర్భిణీలకు భరోసానిస్తోంది "ఎనీమియా ముక్త్ నిర్మల్" (రక్తహీనత లేని నిర్మల్ జిల్లా) ప్రాజెక్టు పేరిట కార్యక్రమానికి చర్యలు తీసుకుంటున్నారు.

9 గ్రాముల హిమోగ్లోబిన్ మహిళల గుర్తింపు చర్యలు..

సాధారణ గర్భం ధరించే మహిళలను తొలత ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జిల్లావ్యాప్తంగా ఆశా కార్యకర్తలు మహిళ ఆరోగ్య కార్యకర్తల సహకారంతో మొత్తం గర్భిణీల సంఖ్యను నిర్ధారిస్తారు వారందరికీ హిమోగ్లోబిన్ పరీక్షలు చేయనున్నారు 9 గ్రాముల కన్నా తక్కువగా హిమోగ్లోబిన్ ఉండే గర్భిణీలను గుర్తిస్తారు. ప్రభుత్వం అందజేయనున్న న్యూట్రిషన్ కిట్లతోపాటు వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో గర్భిణీలకు వైద్యం అందించనున్నారు. న్యూట్రిషన్ ఫుడ్ తోపాటు ప్రత్యేకంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మాత శిశు సంరక్షణ కేంద్రాలకు తరలించి ఐరన్, శుక్రోజ్ సూది మందుతో వారిలో హిమోగ్లోబిన్ పెంపునకు చర్యలు తీసుకోనున్నారు. దీని ద్వారా ఏ ఒక్క గర్భిణీ స్త్రీ కి కూడా తొమ్మిది గ్రాముల కన్నా హిమోగ్లోబిన్ తక్కువగా ఉండకుండా చూసే కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కలెక్టర్ ప్రణాళికను సిద్ధం చేశారు.

సాధారణ ప్రసవాల పెంపునకు శ్రీకారం..

ఎనిమియా ముక్త్ నిర్మల్ కార్యక్రమం అమలు ద్వారా జిల్లాలో సాధారణ ప్రసవాల పెంపునకు కలెక్టర్ శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువగా సి - సెక్షన్ ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాల్లో నిర్మల్ కూడా ఉంది. దీనిపై గత కలెక్టర్ కూడా పలురకాల చర్యలు చేపట్టినప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితాలు రాలేదు. తాజాగా నిర్మల్ కొత్త కలెక్టర్ వరుణ్ రెడ్డి కూడా దీని పైనే దృష్టి పెట్టారు. అయితే ఆయన కొత్త ప్రయోగానికి చర్యలు తీసుకుంటున్నారు. దీని ద్వారా మంచి ఫలితాలు వస్తాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నేడు కీలక సమావేశం..

కలెక్టర్ వరుణ్ రెడ్డి తీసుకుంటున్న కొత్తప్రాజెక్టు అమలును విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో తిరుమల గార్డెన్స్ లో ఆశ కార్యకర్తలు మహిళ ఆరోగ్య కార్యకర్తలు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు వైద్యాధికారులు పర్యవేక్షణ సిబ్బందితో కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగనుంది.



Next Story

Most Viewed